ఆసిఫాబాద్‌అర్బన్: పదోన్నతిపై జిల్లాకు వ చ్చిన అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించా రు. జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతి నిధుల సహకారంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతకు ముందు కలెక్టర్ కె.హరితను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించా రు. జిల్లా పౌరసంబంధాల అధికారి వై.సంపత్‌కుమార్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి(ఏవో) కిరణ్‌కుమార్ అదనపు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


