వి‘నూతనం’గా సందేశం | - | Sakshi
Sakshi News home page

వి‘నూతనం’గా సందేశం

Apr 29 2026 7:24 AM | Updated on Apr 29 2026 7:24 AM

● రోడ్డు ప్రమాదాలు, బెట్టింగ్‌లపై కౌటాల ఎస్సై అవగాహన ● రీల్స్‌తో విస్తృత ప్రచారం

కౌటాల: ‘మీరు గెలిచేది రూపాయి.. ఓడిపోయేది మాత్రం మీ ప్రాణం.. గెలిచే ప్రతీ రూపాయి కంటే మీ ప్రాణం వెలకట్టలేనిది.. పందెంతో ప్రాణాలు పణంగా పెట్టకండి. మీరు కూడా బెట్టింగ్‌ భూతాని కి బలి కావొద్దు..’ అంటూ యువతకు సందేశం ఇస్తూ కౌటాల ఎస్సై డి.చంద్రశేఖర్‌ ఇటీవల చేసిన వీడియో రీల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెల 18న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘పల్లెల్లో బెట్టింగ్‌ భూతం’ కథనానికి ఆయన స్పందించారు. బెట్టింగ్‌ నష్టాలపై యువతకు అవగాహ న కల్పించడానికి స్థానిక ‘ఫేమస్‌ కురాళ్లు’ యూ ట్యూబర్లతో కలిసి సందేశంతో కూడిన వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఐపీఎల్‌ నేపథ్యంలో యువత బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే డ్రంకెన్‌ డ్రైవ్‌తో కలిగే నష్టాలపై తీసిన వీడియో సైతం వైరల్‌గా మారింది. ఎస్సై చూపిన చొరవను పలువురు అభినందిస్తున్నారు. వాట్సాప్‌ స్టేటస్‌లతో పాటు ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రాం, యూట్యూబ్‌ రీల్స్‌లో పోస్టు చేస్తున్నారు.

యువతకు అవగాహన కల్పించాలనే..

బెట్టింగ్‌ నష్టాలతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని తరుచూ వార్తా పత్రికల్లో చూస్తున్నాం. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే యువతకు బెట్టింగ్‌ నష్టాలపై అవగాహన కల్పించాలని స్థానిక యూట్యూబర్లతో కలిసి సందేశంతో కూడిన వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాం. ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలి. – డి.చంద్రశేఖర్‌, కౌటాల ఎస్సై

Advertisement
 
Advertisement
Advertisement