జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) 26వ ఆవిర్బావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తనయుడు కోవ సాయినాథ్‌ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం తె లంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. రెండున్నర దశాబ్దాల్లో పార్టీ సాధించిన విజయాలు, రాష్ట్ర సాధన, అభివృద్ధిలో బీఆర్‌ఎస్‌ పాత్రను స్మ రించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అ ధ్యక్షుడు రవీందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకా శ్‌, వైస్‌ చైర్మన్‌ ఎండీ అహ్మద్‌, నాయకులు మర్సుకో ల సరస్వతి, అలీబిన్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, బాలకృష్ణ, రాజంపేట సర్పంచ్‌ బుర్స పో చయ్య, ఉప సర్పంచ్‌ లక్ష్మి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement