రెబ్బెన: ప్రపంచ కార్మిక దినోత్సవం మే డేను పురస్కరించుకుని సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గోలేటి సీహెచ్‌పీలో మహిళా ఉద్యోగులకు పలు క్రీడాపోటీలు నిర్వహించారు. గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి మాట్లాడుతూ పురుషులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు క్రీడానైపుణ్యం చాటుకోవడం అభినందనీయమన్నారు. కార్మిక రంగంలో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు సీహెచ్‌పీ హెచ్‌వోడీ కోట య్య బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, పిట్ కార్యదర్శి రామయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులు శేషు, కిరణ్, శ్రీనివాస్, షమీ, సురేష్‌కోరి, కోశాధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు.


