సీనియర్‌ సివిల్‌ జడ్జిగా సంకేత్‌ మిశ్రా | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సివిల్‌ జడ్జిగా సంకేత్‌ మిశ్రా

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలోని సబ్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా సంకేత్‌ మిశ్రా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివర కు ఇక్కడ పనిచేసిన సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ బదిలీ అయ్యారు. సంకేత్‌ మిశ్రా కు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి మాట్లాడు తూ పెండింగ్‌ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని సూచించారు. కా ర్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి అనంత లక్ష్మి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బోనగిరి సతీశ్‌బాబు, న్యాయవాదులు తాటిపెల్లి సురే శ్‌, ముక్త సురేశ్‌, డి.వెంకటేశ్వర్లు, జగన్‌మోహన్‌రావు, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement