ఆసిఫాబాద్‌రూరల్: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లా విద్యార్థినులు ఎంపికయ్యారని ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ తెలి పారు. క్రీడాకారులను సోమవారం కోచ్ అరవింద్‌తో కలిసి జిల్లా కేంద్రంలో సోమవారం అభినందించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో జిల్లాకు చెందిన నందిని, కవిత ప్రతిభ చూపారన్నా రు. ఈ నెల 28 నుంచి 30 వరకు హన్మకొండలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటా రని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్ ఉన్నారు.


