2 వరకు అవగాహన కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

2 వరకు అవగాహన కార్యక్రమాలు

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ నెల 27 నుంచి మే 2 వరకు ఆరురోజులపాటు అవగాహ న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నితిక పంత్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో భరోసా కేంద్రం, షీటీం సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. షీటీం, భరోసా కేంద్రం, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీసులు సంయుక్తంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపా రు. ముఖ్యంగా పిల్లలు, మహిళల రక్షణ, భద్రత, మాదకద్రవ్యాల నివారణ, సైబర్‌ నేరాల నివారణ, లింగ సమానత్వం, బాల్య వివాహాల నివారణ, గుడ్‌ టచ్‌– బ్యాడ్‌ టచ్‌ అవగాహన, యాంటీ ర్యా గింగ్‌ వంటి అంశాల గురించి గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్‌ పరిసర ప్రాంతాలు, ప్రజలు గుమిగూడే ప్రదేశాలలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పనిప్రదేశాల వద్ద మహిళలపై అకృత్యాల గురించి అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. సమావేశంలో డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ బుద్దె స్వామి, భరోసా కేంద్రం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ దివ్య, షీటీం ఎస్సై బిక్కులాల్‌ పాల్గొన్నారు.

ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం వివిధ మండలాలకు చెందిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. మొత్తం 16 ఫిర్యాదులు స్వీకరించగా, పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement