బుద్ధ జయంతిని సెలవుగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

బుద్ధ జయంతిని సెలవుగా ప్రకటించాలి

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

ఆసిఫాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం బుద్ధ జయంతి ని సెలవు దినంగా ప్రకటించాలని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ మహోర్కర్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని లుంబినీ దీక్షభూమి వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ సంఘా ల నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో అనేక మంది సంస్కర్తల జయంతి, పండుగలకు సెలవు ప్రకటించారని గుర్తు చేశారు. అనంతరం ఈ నెల 29న కెరమెరి మండలం గోయగాంలో నిర్వహించే అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణకు హాజరు కావాలని ఎస్పీ నితిక పంత్‌కు ఆహ్వానపత్రం అందించారు. లుసియానా అమెరికన్‌ యూనివర్సిటీ పూణే నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్న ఆయను ఉపాధ్యాయ, కుల సంఘాల ఆధ్వర్యంలో శాలు వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ సెంటర్‌ కమిటీ అధ్యక్షుడు మసాదే ప్రశాంత్‌, నాయకులు తుకారాం, సంతోష్‌, రాజు, తారు, దత్తు, శంకర్‌, ఆనంద్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement