మారుమూల గ్రామాల్లో విచ్చలవిడిగా గుడుంబా తయారీ గుట్టుగా కిరాణ దుకాణాల్లో అమ్మకాలు బానిసలుగా మారి అనారోగ్యం బారిన పడుతున్న ప్రజలు
పెంచికల్‌పేట్ మండలం దరోగపల్లికి చెందిన కర్నె పెంటయ్య వారం రోజులపాటు గ్రామంలో దొరికే నాటుసారా తాగాడు. అస్వస్థతకు గురై ఈ నెల 21న గ్రామంలోనే మరణించాడు. ఇంటిపెద్ద గుడుంబా తాగి మరణించడంతో భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు.
పెంచికల్‌పేట్: జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలు, పల్లెల్లో గుడుంబా గుప్పుమంటోంది. తయారీదారులు ప్రత్యేకంగా నీటి లభ్యత ఉన్న ప్రాంతాలను ఎంచుకుని నాటుసారా తయారీ చేస్తున్నారు. పక్కా ప్రణాళికతో గ్రామాల్లోని దుకాణాల కు తరలించి విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో ఎకై ్సజ్, పోలీసుశాఖల అధికారులు దాడులు చే స్తున్నారు. బెల్లం పానకం, సారా స్వాధీనం చేసుకు ని కేసులు నమోదు చేస్తున్నా వారి తీరుమాత్రం మారడం లేదు. నాలుగు రోజుల క్రితం పెంచికల్‌పే ట్ మండలం దరోగపల్లికి చెందిన కర్నె పెంటయ్య గుడుంబా తాగి తీవ్ర అస్వస్థతతో మృతి చెందడం పల్లెల్లో గుడుంబా తీవ్రతకు అద్దం పడుతోంది.
గుట్టుగా రవాణా
గ్రామీణ మండల కేంద్రాల నుంచి నిత్యం బొలెరో వాహనాలు పట్టణ ప్రాంతాలకు వాణిజ్యపరంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు పట్టణాల నుంచి గుట్టుచప్పుడు కా కుండా నాటుసారా తయారీకి వినియోగించే నల్ల బెల్లం, చక్కెర, పటిక, యూరియాను పెద్దఎత్తున తరలిస్తున్నారు. అక్కడి నుంచి మారుమూల ప్రాంతాల్లో గుడుంబా తయారీదారులకు విక్రయిస్తున్నారు. బెల్లం అమ్మకాలపై నిఘా పెరగడంతో వ్యాపారులు చక్కెర దిగుమతిపై దృష్టి సారించారు.
దుకాణాలే అడ్డాలు
హానికరమైన పదార్థాలతో తయారు చేస్తున్న గు డుంబాను ప్యాకెట్ల రూపంలో కిరాణ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ వేలాది లీటర్ల విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. బెల్టుషాపులు, కొన్ని కిరాణ దుకాణాలు విక్రయాలకు అడ్డాగా మారాయి. నాటుసారాను వృత్తిగా మార్చుకున్న కొంత మంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అమ్మోనియా, యూరియా వంటి రసాయనాలతో అనారోగ్యం బారిన పడుతున్నారు. వేసవిలో ఎండలకు గుడుంబా తాగితే శరీరం డీహైడ్రేషన్‌కు గురై తీవ్ర అస్వస్థత, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలా కొందరు పరిస్థితి చేయిదాటి ప్రాణాలు కోల్పోతుండగా, పదుల సంఖ్యలో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో పేదలు ఆస్పత్రి ఖర్చులకు ఆర్థికంగా చితికిపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు అడపాదడపా దాడులను చేస్తున్నా తయారీ, విక్రయాల జోరుకు బ్రేకులు పడటం లేదు. అధికారులు ఇప్పటికై నా స్పందించి విచ్చలవిడిగా వెలిసిన నాటుసారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆటోలో తరలిస్తున్న గుడుంబాను పట్టుకున్న పోలీసులు
కేసులు 196
నేరస్తులు 174
బైండోవర్ చేసిన వ్యక్తులు 63
పట్టుకున్న నాటుసారా 775లీటర్లు
బెల్లం 950 కిలోలు
పటిక 335 కిలోలు
బెల్లం పానకం 3500 లీటర్లు
సీజ్ చేసిన వాహనాలు 19


