ఘనంగా వాసవీమాత జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వాసవీమాత జయంతి

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలోని ఏఎంసీ కార్యాలయంలో వాసవీ కన్యకాపరమేశ్వరీ జయంతి ఆదివారం ఘనంగా నిర్వహించా రు. వాసవీ మాత జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో చైర్‌పర్సన్‌ ఇరుకుల్ల మంగ ఆర్యవైశ్యులతో కలిసి వాసవీ మాత చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నా రు. ఆమె మాట్లాడుతూ వాసవీమాత చూపించిన సత్యమార్గంలో నడుస్తూ, సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా ఆత్మాహుతి చేసి, ధైర్యం, త్యాగం పాఠాలు నేర్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రతినిధులు కొలిప్యాక వేణుగోపాల్‌, ఎకిరాల శ్రీనివాస్‌, చెట్ల ప్రశాంత్‌, కొలిప్యాక రవి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement