ఆదిలాబాద్: నిజామాబాద్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బేస్‌బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించాలని బేస్ బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం జిల్లా క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 27 నుంచి నిజామాబాద్‌లో నిర్వహించనున్న పోటీల్లో జిల్లా బాలబాలికల జట్లు సత్తా చాటాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికై న క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జ్యోతి అజయ్, కోశాధికారి గౌతమ్, హరిచరణ్, వ్యాయామ ఉపాధ్యాయులు వికాస్, సాయిరామ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.


