‘ముందస్తు’కు స్పందన | - | Sakshi
Sakshi News home page

‘ముందస్తు’కు స్పందన

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

● ‘ఎర్లీబర్డ్‌’ చెల్లింపులకు ఈ నెలాఖరు వరకు గడువు ● రాయితీని సద్వినియోగం చేసుకుంటున్న పట్టణ ప్రజలు

కాగజ్‌నగర్‌టౌన్‌: మున్సిపాలిటీల ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముందస్తు ట్యాక్స్‌ చెల్లింపు(ఎర్లీబర్డ్‌) పథకానికి కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. 2025– 2026 సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలు లేని వారికి 2026–27 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా పన్ను చెల్లించే అవకాశం కల్పించారు. ఈ నెల 30వ తేదీలోపు పన్నులు చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ప్రకటించారు. దీంతో ఆసక్తిగల పన్నుదారులు కార్యాలయలు, మున్సిపల్‌ సిబ్బందికి చెల్లిస్తున్నారు. బిల్‌ కలెక్టర్లు సైతం వార్డుల వారీగా తిరుగుతూ అవగాహన కల్పిస్తూ వసూళ్లు ముమ్మరం చేశారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ బల్దియాలు ఉన్నాయి. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో భవన సముదాయాల ద్వారా ఏటా సుమారు రూ.5 కో ట్ల ఆస్తి పన్ను వస్తుంది. సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ప్రభు త్వ పన్నుల బకాయిలు ఏడాది తర్వాత కాకుండా ముందుగానే వసూలు చేయాలనే లక్ష్యంతో ఎర్లీ బర్డ్‌ పథకం అమలు చేస్తుంది. ఈ ఏడాది కాగజ్‌నగర్‌లో 15,138 భవన సముదాయాలకు రూ.3.53 కోట్లు, ఆసిఫాబాద్‌ పట్టణంలో 6,433 భవన సముదాయాలకు రూ.2.57కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు కాగజ్‌నగర్‌లో 7.65శాతం, ఆసిఫాబాద్‌లో 4.67 శాతం వసూళ్లు పూర్తయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉండడంతో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లింపుల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాత బకాయిలు లేకుండా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందవచ్చు. ఈ అవకా శం ఈ నెల 30 వరకు కొనసాగుతుంది. వార్డుల వారీగా అవగాహన కల్పిస్తున్నాం. పట్టణ ప్రజ లు ముందస్తుగా చెల్లించి రాయితీ పొందా లి.

– తిరుపతి, మున్సిపల్‌ కమిషనర్‌, కాగజ్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement