‘మహిళా లోకానికి తీవ్ర అన్యాయం’ | - | Sakshi
Sakshi News home page

‘మహిళా లోకానికి తీవ్ర అన్యాయం’

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: మహిళా బిల్లును అడ్డుకుని కాంగ్రెస్‌, మిత్ర పక్షాలు మహిళా అన్యాయం చేశాయని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు విమర్శించారు. మేడ్చల్‌ జిల్లా షోపూర్‌లోని భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. నారీ శక్తి వందన్‌ అథినియమ్‌ను అడ్డుకుని కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు నిజస్వరూపాన్ని బయటపెట్టాయన్నారు. మహిళా ద్రోహులుగా వారిని సమాజం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని స్పష్టం చేశా రు. పీఎం నరేంద్రమోడీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో మేడ్చల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, మాజీ కార్పొరేటర్‌ విజయలక్ష్మి, నాయకులు సరిత, ఝాన్సీ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే హరీశ్‌బాబు

Advertisement
 
Advertisement
Advertisement