సెల్‌ఫోన్‌లోనే సెల్ఫ్ ఎన్యుమరేషన్
నేటి నుంచి నమోదు ప్రక్రియ షురూ
ప్రత్యేక పోర్టల్ రూపొందించిన కేంద్రం
వ్యక్తిగత సమాచారం అత్యంత గోప్యం
సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం
కెరమెరి/కాగజ్‌నగర్ టౌన్: జనగణన–2027లో భా గంగా నేటి నుంచి స్వీయ జనగణన ప్రక్రియ ప్రా రంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియకు భిన్నంగా ప్రభుత్వం ఈసారి జనగణన సర్వే నిర్వహిస్తోంది. గతంలో నేరుగా ఎన్యుమరేటర్లు ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించేవారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం సాంకేతిక విధానాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవాలని భావించింది. ఇందుకు ఆదివారం నుంచి స్వీయ గణన ప్రక్రియ నిర్వహించేందుకు నిర్ణయించింది. దేశభవిష్యత్‌ను నిర్ణయించే అత్యంత కీలక జనగణన–2027 ప్రక్రియ జిల్లాలో చారి త్రాత్మకంగా అడుగు వేయబోతుంది. ఈసారి నిర్వహించనున్న జనగణన అంకెల సర్వే కాకుండా డిజి టల్ యజ్ఞంలా రూపొందించారు. జిల్లాలో ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా ని ర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని వివిధ మండలాల్లో శనివారం ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి ప్ర త్యేక సమావేశాలు నిర్వహించి స్వీయ గణనపై అవగాహన కల్పించారు. వికసిత్ భారత్– 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రజలే స్వయంగా తమ వివరా లు నమోదు చేసుకునే స్వీయ నమోదు విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. స్వీయగణన నేటి నుంచి వచ్చే నెల 10వరకు కొనసాగనుంది. ఇందుకు సంబంధించి అవగాహన కోసం నేటి నుంచి గ్రామాల్లో చాటింపు చేయనున్నారు. అంగన్‌వాడీలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, ఉపాధి హామీ సిబ్బంది, ఇందిరా క్రాంతిపథం, మండల సమాఖ్య తదితర శాఖల అధికారులు ప్రజలకు డిజిటల్ సర్వేపై అవగాహన కల్పించనున్నారు.
స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు..
అధికారులు ఇంటి వరకు వచ్చే అవసరం లేకుండా మనకు మనమే స్వయంగా వివరాలు నమోదు చే సుకోవచ్చు. అధికారులు వచ్చేవరకు వేచి చూడాల్సి న అవసరమే లేదు. మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే కు టుంబ వివరాలు నమోదు చేయవచ్చు. ఈ విధానంతో సమాచార లోపాలు తలెత్తే అవకాశముండదు. సాధారణ గణనలో అధికారులు వచ్చినప్పు డు ఇంట్లో అందరూ అందుబాటులో లేకపోవడం లేదా సమాచార లోపం లాంటి సమస్యలు ఎదురయ్యేవి. సెల్ఫ్ ఎన్యుమరేషన్‌తో వీలును బట్టి తీరిక సమయంలో మనమే స్వయంగా వివరాలు నమో దు చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా తప్పులు దొ ర్లే అవకాశముండదు. ఒకవేళ ఏదైన పొరపాటు జరి గినా వెంటనే సరిదిద్దుకునే వెసులుబాటూ ఉంది. అధికారులు ఇంటికి సర్వే కోసం వచ్చినప్పుడు స్వీ య నమోదు ప్రక్రియ తర్వాత వచ్చే 11అంకెల ఐడీ ని చూపిస్తే సరిపోతుంది. యువత, విద్యావంతులు ఈ డిజిటల్ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలి.
సంక్షేమ పథకాలకు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ డేటాను ప్రామాణికంగా తీసుకోనున్నారు. జిల్లాలు, రాష్ట్రాలకు వనరుల పంపిణీలో పారదర్శకత కోసం నిధుల కేటాయింపు ఈ జనగణన ఆధారంగా తీసుకోనున్నట్లు తెలు స్తోంది. పాఠశాలలు, ఆస్పత్రులు, రహదారులు, ఇతర ప్రత్యేక నిర్మాణాల ప్రక్రియ అత్యంత కీలకం కానుంది. అయితే, తొలుత 26, 27 తేదీల్లో అధికా రులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్ ఇళ్లకు వెళ్లి జనగణన ప్రారంభించనున్నారు. ఎంపీడీవోలు, తహసీ ల్దార్లు, ఎంపీవోలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకుని వారితో నమోదు చేయిస్తారు.
ప్రత్యేక పోర్టల్ ద్వారా..
డిజిటల్ స్వీయ సర్వే నిర్వహణకు కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది. ముందుగా https://se.census.gov.in వెబ్ సైట్‌ను మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా రిజి ష్ట్రేషన్ పూర్తి చేయాలి. గృహ గణన, కుటుంబ సభ్యుల సమాచారాన్ని 33 కాలమ్స్‌లలో పూరించి సబ్‌మిట్ చేయాలి. తర్వాత వచ్చే 11 అంకెల ప్రత్యేక ఐడీ (ఎస్‌ఈఐడీ)ని భద్రపర్చుకోవాలి. ఎన్యుమరేటర్లు మీ ఇంటికి వచ్చినపుడు మీరు భద్రపరిచిన ఐడీ నంబర్ తెలియజేస్తే వారు పరిశీలన పూర్తి చేసినట్లు నిర్ధారిస్తారు. జనగణన చట్టం–1948 ప్రకా రం వ్యక్తిగతంగా మీరిచ్చే సమాచారాం అ త్యంత గోప్యంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిని ఏ ఇతర ఓటరు జాబి తా లేదా తనిఖీ కోసం వినియోగించే అవకాశముండదని స్పష్టం చేశారు.
జిల్లాకు సంబంధించిన వివరాలు


