కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

రెబ్బెన: స్ట్రక్చర్‌ కమిటీల ద్వారా యాజమాన్యం దృష్టికి వచ్చిన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్‌.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి కోరా రు. శనివారం బెల్లంపల్లి ఏరియా పర్యటనలో భా గంగా ఖైరిగూర ఓసీపీకి వచ్చిన సింగరేణి డైరెక్టర్‌ (పీఅండ్‌పీ) వెంకటేశ్వర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. 2025 జూలై నుంచి జరిగిన మెడికల్‌ బోర్డులను సమీక్షించి దరఖాస్తు చే సుకున్నవారిని అన్‌ఫిట్‌ చేసి కారుణ్య నియామకా లు కల్పించి సహకరించాలని కోరారు. ఉద్యోగులందరికీ వెంటనే సొంతింటి పథకం అమలు చేయాలని, ఇందుకోసం వేసిన కమిటీలో యూనియన్‌ ప్ర తినిధులనూ సభ్యులుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. సీఐఎల్‌, సింగరేణి ఎగ్జిక్యూటివ్‌ల తరహా లోనే సాధారణ కార్మికులకు పెర్క్స్‌పై ఆదాయపు పన్నును రీఫండ్‌ చేయాలని, ఖాళీగా ఉన్న క్లరికల్‌ స్టాఫ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఇతర సమస్యలూ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు శేషశయనరావు, జూపాక రాజే శ్‌, కిరణ్‌బాబు, ఖైరిగూడ పిట్‌ కార్యదర్శి మారం శ్రీనివాస్‌, యానియన్‌ నాయకులు ఆఫ్రిది, వెంకటేశ్‌, శ్రీనివాస్‌, రవి, రమేశ్‌, సుధీర్‌, రారాజు, కోటి, శ్రీనివాస్‌, రాంకిషన్‌, శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement