లింగాపూర్: మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకుసాగాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా వసుధ ఫౌండేషన్ స్వ చ్ఛంద సేవా సంస్థ సహకారంతో జైనూర్ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో ఆదివాసీ మహిళలకు ఏర్పాటు చేసిన ఉచి త కుట్టు శిక్షణను ఎస్పీ శనివారం ప్రారంభించారు. ఉచిత కుట్టు శిక్షణను మహిళలు సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొంది కుటుంబాన్ని పోషించుకునేందుకు ఇ ది చక్కని అవకాశమన్నారు. ఆర్థికంగా స్వావలంబన సాధించి గుర్తింపు పొందాలని సూ చించారు. జైనూర్ సీఐ రమేశ్, ఎస్సైలు రవి కుమార్, విక్రమ్, గ్రామపంచాయతీ సర్పంచ్ కోడప ప్రకాశ్, 40మంది మహిళలున్నారు.


