రోడ్డు పనులకు భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

రోడ్డు పనులకు భూమిపూజ

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: పీఎం జన్‌మన్‌ పథకం కింద మంజూరైన రూ.3కోట్లతో పాత రౌట సంకెపల్లి గ్రా మంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుమురంభీం పుట్టిన ఊరికి రోడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు. రోడ్డు నిర్మా ణం పూర్తయితే గిరిజన గ్రామాల ప్రజల రోడ్డు క ష్టాలు తీరనున్నాయని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని చెప్పారు. సర్పంచ్‌ పండు, గ్రామస్తులున్నారు.

ఫూలే దంపతుల విగ్రహావిష్కరణ

వాంకిడి: మండలంలోని నార్లాపూర్‌ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతుల విగ్రహాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు, సీ్త్రల అభున్నతికి ఎనలేని కృషి చేసిన సామాజిక ఉద్యమకారులు ఫూలే దంపతులు అని కొనియాడారు. అంతకుముందు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పూలాజీ బాబా సంస్థాన్‌ పట్నాపూర్‌ అధ్యక్షుడు ఇంగ్లె కేషవ్‌రావు, సర్పంచులు బాపూజీ, సతీశ్‌, నాయకులు అజయ్‌కుమార్‌, సెండె వాసు, మెంగాజీ, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement