ఆసిఫాబాద్‌రూరల్: వేసవి క్రీడా క్యాంపులను సద్వి నియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిత సూచించా రు. శనివారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీ డా పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరా న్ని డీటీడీవో రమాదేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలకు మరింత పదు ను పెట్టేందుకు క్రీడా శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు ఉదయం, సా యంత్రం వేళల్లో క్రీడల్లో శిక్షణ తీసుకోవాలని సూ చించారు. హ్యాండ్‌బాల్, కబడ్డీ, అథ్లెటిక్స్‌పై శిక్షణ ఇ స్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సద్వినియోగం చే సుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. డీవైఎ స్వో ఆశ్వక్, డీఎస్వో షేకు, ఏసీఎంవో ఉద్ధవ్, జీసీడీవో శకుంతల, హెచ్‌ఎం సాయిబాబా, పీడీ తిరుప తి, కోచ్ అరవింద్, విద్యాసాగర్ తదితరులున్నారు.
11నుంచి తొలివిడత జనగణన
ఆసిఫాబాద్‌అర్బన్: మే 11నుంచి జిల్లాలో తొలివిడత జనగణన నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 26నుంచి మే 10వరకు స్వీయగణనకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,689 ఇళ్ల బ్లాక్‌లను గు ర్తించామని, 994 మంది ఎన్యుమరేటర్లు, 174 మంది సూపర్‌వైజర్లను నియమించినట్లు తెలిపారు.


