శంకర్‌గౌడ్‌ కుటుంబానికి రూ.2కోట్లు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి రూ.2కోట్లు చెల్లించాలి

Apr 25 2026 8:06 AM | Updated on Apr 25 2026 8:06 AM

రెబ్బెన: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట్‌ డిపో డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ కుటుంబానికి రూ.2కోట్ల పరిహారం చెల్లించాలని మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేసరి ఆంజనేయులుగౌడ్‌ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కు ముందు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. చట్టబద్ధంగా సమ్మె నోటీసు ఇచ్చి కార్మికులు ఆందోళనకు దిగినా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఈ పరి స్థితి ఏర్పడిందన్నారు. శంకర్‌గౌడ్‌ది ఆత్మహ త్య కాదని, ప్రభుత్వ హత్యని మండిపడ్డారు. పరిహారం చెల్లించడంతోపాటు బాధిత కు టుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నీరజగౌడ్‌, జిల్లా అధ్యక్షుడు మనోహర్‌గౌడ్‌, రాష్ట్ర కార్యదర్శి లావణ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement