ఆసిఫాబాద్‌రూరల్: గ్రామీణ వ్యవస్థ పటిష్టమైతేనే పురోగతి సాధ్యమవుతుందని డీపీవో భిక్షపతిగౌడ్ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభకు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పాటుపడాలన్నారు. ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీవో మౌనిక, సర్పంచ్ రాజన్న తదితరులు పాల్గొన్నారు.


