సెపక్‌తక్రా రెఫరీగా కుమ్మరి మల్లేశ్‌ | - | Sakshi
Sakshi News home page

సెపక్‌తక్రా రెఫరీగా కుమ్మరి మల్లేశ్‌

Apr 25 2026 8:06 AM | Updated on Apr 25 2026 8:06 AM

రెబ్బెన: జాతీయసా యి సెపక్‌తక్రా పోటీ ల రెఫరీగా రెబ్బెన మండలం గోలేటికి చెందిన సీనియర్‌ క్రీ డాకారుడు కుమ్మరి మల్లేశ్‌ ఎంపికైనట్లు సెపక్‌తక్రా అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా కొరివిలో ఈ నెల 28 వరకు జరిగే అండర్‌– 14 జాతీ య స్థాయి సెపక్‌తక్రా పోటీలకు మల్లేశ్‌ రెఫరీగా వ్యవహరించనున్నారు. గతంలో మల్లేశ్‌ రాష్ట్ర జట్టు కోచ్‌, మేనేజర్‌గా పనిచేశారు. 2008, 2009లో సెపక్‌తక్రా జాతీయ స్థాయి రెఫరీగా సేవలందించారు. ఆయనను అసోసియేషన్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష, కార్యవర్గ సభ్యులు భాస్కర్‌, రామకృష్ణ, ఒలింపిక్‌ అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారాయణరెడ్డి, ఉమ్మడి జిల్లా సెపక్‌తక్రా ఉపాధ్యక్షుడు ఎస్‌.తిరుపతి తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement