రెబ్బెన: మహబూబా బాద్ జిల్లా కొరివిలో జరగనున్న 69వ జాతీ య స్థాయి సెపక్‌తక్రా అండర్– 14 బాలుర పోటీలకు రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్ సింగరేణి ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి గంగాధరి శివచరణ్ ఎంపికైనట్లు సెపక్‌తక్రా అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుమ్మరి మల్లేశ్ తెలిపారు. ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగే ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరుఫున పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. జాతీయస్థాయికి ఎంపికైన జిల్లా క్రీడాకారుడిని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజేషన్ కార్యదర్శి వెంకటేశ్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి తదితరులు అభినందించారు.


