గంగుబాయి కుటుంబాన్ని ఆదుకుంటాం | - | Sakshi
Sakshi News home page

గంగుబాయి కుటుంబాన్ని ఆదుకుంటాం

Apr 25 2026 8:06 AM | Updated on Apr 25 2026 8:06 AM

● విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్‌

కెరమెరి: జ్వరంతో మృతి చెందిన గంగుబాయి కుటుంబాన్ని ఆదుకుంటామని కలెక్టర్‌ కె.హరిత అ న్నారు. సిర్పూర్‌(యు) మండలంలోని మహగాం ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గంగుబాయి ఇటీవల మృతి చెందగా, శుక్రవారం గిరి జన సంక్షేమశాఖ డీడీ రమాదేవితో కలిసి విద్యార్థిని స్వగ్రామం బాజ్జిపేట్‌ను సందర్శించారు. గంగుబా యి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు జంగుబాయి, సోమ్‌రావును పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా హామీ ఇచ్చారు. నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించా రు. తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా, వెంటనే చేతిపంపు మంజూరు చేశారు. జీసీడీవో శకుంతల ఉన్నారు.

జనగణన పకడ్బందీగా నిర్వహించాలి

మేలో ప్రారంభమయ్యే జనగణన పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జైనూర్‌ మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల శిక్షణలో మాట్లాడారు. ప్రతీ ఇంటికి వెళ్లి 32 అంశాలను సేకరించాలన్నారు. జిల్లాలో 994 మంది ఎన్యూమరేటర్లు, 174 మంది సూపర్‌వైజర్లు విధుల్లో ఉంటారని తెలిపారు. ఇప్పటివరకు 1,689 ఇళ్ల జాబితా బ్లాక్‌లను గుర్తించా మని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బీర్‌శా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement