గ్యాస్‌ ప్రమాదాల కలకలం | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ప్రమాదాల కలకలం

Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM

● కాగజ్‌నగర్‌ పట్టణంలో వరుస ఘటనలు

కాగజ్‌నగర్‌: ప్రస్తుత కాలంలో ప్రతీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ల వినియోగం అనివార్యమైంది. అయితే ఇ టీవల కాగజ్‌నగర్‌ పట్టణంలో చోటుచేసుకుంటున్న వరుస గ్యాస్‌ ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల 21న పట్టణంలోని అంబేద్కర్‌ చౌక్‌లో గల ఓ హోటల్‌లో సంభవించిన గ్యాస్‌ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. మల్లేశ్‌ అనే కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, కరీంనగర్‌ ఆ స్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మార్చిలో 20వ వార్డు(కరుణరోడ్డు) వద్ద ఓ ఇంట్లో సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకై ంది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అంతకు ముందు పెట్రోల్‌ పంపు ఏరియాలోని ఓ వసతి గృహంలోనూ సిలిండర్‌ లీకై ప్రమాదం తప్పింది. వసతి గృహంలోని కిచెన్‌ సామగ్రి కాలిపోయింది.

ఒకే ఏజెన్సీ సిలిండర్లు..!

కాగజ్‌నగర్‌లో చోటు చేసుకుంటున్న అన్ని ప్రమాదాల్లో ఒకే ఏజెన్సీకి చెందిన గ్యాస్‌ సిలిండర్లు ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. మూడు ప్రమాదాల్లో బాధితులు ఒకే ఏజెన్సీకి చెందిన సిలిండర్లు వినియోగించడంతో నిర్వాహకుల ముందు జాగ్రత్త చర్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి వసంత లక్ష్మిని ఫోన్‌లో పలుమార్లు సంప్రదించగా, అందుబాటులో రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement