ట్రాఫిక్‌ పరేషాన్‌..! | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ పరేషాన్‌..!

Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో వాహనదారులకు నిత్యం నరకం కనిపిస్తోంది. ప్రధాన రహదారులపై ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతోంది. పొట్టి శ్రీరాములు చౌరస్తా, అంబేడ్క ర్‌ చౌరస్తా, రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలో, హరిద్వార్‌ లాడ్జ్‌ మూలమలుపు వరకు ఉన్న ప్రధాన రహదారి రద్దీకి కేరాఫ్‌గా మారింది.

ఆక్రమణలే కారణం

పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా, రాజీవ్‌ గాంధీ చౌరాస్తా, ప్రధాన మార్కెట్‌ ఏరియాల్లో ఇరువైపులా దుకాణాల యజమానులు, చిరువ్యాపారులు దుకాణాల ఎదుట ఉన్న ఫుట్‌పాత్‌లను ఆక్రమించారు. వస్తువులను రోడ్డుపైకి పెడుతున్నారు. దీనికితోడు తోపుడు బండ్లు, చిరువ్యాపారులు రోడ్డుపైనే అమ్మకాలు సాగి స్తున్నారు. దీంతో వాహనాలు వెళ్లడానికి స్థ లం లేకుండా పోయింది. 30 అడుగుల రోడ్డులో 10 అడుగులు ఆక్రమణలకే సరిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్కింగ్‌ స్థలం ఎక్కడ..?

పట్టణంలో ఎక్కడా పార్కింగ్‌ స్థలం లేకపోవడం ఇబ్బందిగా మారింది. వాహనదారులు రోడ్డు పక్కనే కార్లు, బైక్‌లు నిలుపుతున్నారు. దీంతో రోడ్డు మరింత ఇరుకుగా మారుతోంది. ఫుట్‌పాత్‌ ఆక్రమణలను వెంటనే తొలగించాలని, తోపుడు బండ్లకు ప్రత్యేక స్థలం కేటా యించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement