ఆసిఫాబాద్‌అర్బన్: భగీరథ మహర్షి సేవలు భారతీయ సంస్కృతిలో చిరస్మరణీయమని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం అదనపు కలెక్టర్ డేవి డ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఇతర అధికారులతో కలిసి భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత రం మాట్లాడుతూ తలపెట్టిన పనిని పూర్తి చేసేంతవరకు పట్టుదలతో ప్రయత్నించాలని సూచించారు. సమాజ అభ్యున్నతికి అంకిత భావంతో పనిచేయడంలో భగీరథ స్ఫూర్తిదా యకమని పేర్కొన్నారు. అనంతరం రైతు నమోదు ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని రైతులు తమ వివరాలు న మోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి నదీమ్, గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీఏవో వెంకటి, ఏడీఏ మనోహర్, ఉద్యానవన అధికారి నదీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


