ఆసిఫాబాద్: డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండోరోజుకు చేరింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. సుదూ ర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక్కట్లకు గురయ్యారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో తల్లిదండ్రులు పిల్లలతో బస్టాండ్లలో నిరీక్షించాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక స్థోమత కలిగిన వా రు కార్లలో ప్రయాణించగా, పేదలు ఆటోలను ఆ శ్రయించారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనాల యజమానులు అధిక చార్జీలు వసూలు చేశారు.
తాత్కాలిక సిబ్బందితో సర్వీసులు
ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అధికారులు బస్సులు నడిపించారు. వాంకిడి, మంచిర్యాల, కౌటాల, ఆదిలాబాద్ రూట్లతో సర్వీసులు రాకపోకలు సాగించాయి. 19 సంస్థ బస్సులు, 27 ప్రైవేటు బస్సులు నడిపినట్లు డీఎం రాజశేఖర్ వెల్లడించారు. అయితే పూర్తిస్థాయిలో కండక్టర్లు లభించలేదు. 46 బస్సులు రోడ్డెక్కితే ఇందులో కండక్టర్లు లేని 24 బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. సమ్మె కారణంగా ఆసిఫాబాద్ డిపోకు రోజుకు రూ.16 లక్షల చొప్పున రెండు రోజులు నష్టం వాటిల్లింది.
అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన
జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మెలో ఉండడంతో ప్రజలకు విద్య, వైద్య, ఉపాధి కరువైందన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, 2021–25 సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో జాక్ చైర్మన్ అశోక్, వైస్ చైర్మన్ మంజూల, కార్మికులు జ్యోతి, దివాకర్, నరేశ్, ప్రవీణ్, మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌కు యథావిధిగా సర్వీసులు
కాగజ్‌నగర్‌టౌన్: ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. గురువారం మంచిర్యాల, ఆసిఫా బాద్ డిపోల నుంచి కాగజ్‌నగర్‌కు బస్సులు నడిపించారు. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో మంచి ర్యాల నుంచి కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ నుంచి కా గజ్‌నగర్ పట్టణానికి బస్సులు రావడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఊపిరిపీల్చుకున్నారు. ము ఖ్యంగా కాగజ్‌నగర్ నుంచి మంచిర్యాలకు సర్వీ సులను యథావిధిగా కొనసాగిస్తున్నారు.


