ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత

Apr 23 2026 7:48 AM | Updated on Apr 23 2026 7:48 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యతని కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా అన్నారు. అంతర్జాతీయ మదర్‌ ఎర్త్‌డేను పురస్కరించుకుని బుధవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని, కాలుష్య నియంత్రణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ వంటి చర్యలను చేపట్టాలని కోరారు. చిన్న మార్పులే పెద్ద ఫలితాలకు దారితీస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మధుకర్‌, జిల్లా సైన్స్‌ అధికారి, పర్యావరణ అంబాసిడర్‌ కటుకం మధుకర్‌, ఎంఈవో ప్రభాకర్‌, ప్రధానోపాధ్యాయులు దేవాజీ, పర్శ చంద్రశేకర్‌, డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీనరసింహం, జనార్దన్‌, ఉపాధ్యాయులు షబ్బీర్‌, వేణు, శ్యామ్‌, త్రివేణి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement