జిల్లా టాపర్లకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

జిల్లా టాపర్లకు సన్మానం

Apr 23 2026 7:48 AM | Updated on Apr 23 2026 7:48 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: ఇంటర్మీడియెట్‌లో జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్‌ హరిత సన్మానించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మారుమూల ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు. జైనూర్‌ ప్రభుత్వ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థిని ఐశ్వర్య 967, ఎంపీసీ విద్యార్థి వరప్రసాద్‌ 984 మా ర్కులు సాధించారని తెలిపారు. 15 మంది విద్యార్థులు ఉత్తమ మార్కులతో రాణించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఐఈవో రాందాస్‌, ప్రిన్సిపాళ్లు కళ్యాణి, సంతోష్‌, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement