కాగజ్‌నగర్‌లో డీఆర్‌ఎం పర్యటన | - | Sakshi
Sakshi News home page

కాగజ్‌నగర్‌లో డీఆర్‌ఎం పర్యటన

Apr 23 2026 7:48 AM | Updated on Apr 23 2026 7:48 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో బుధవారం దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం డాక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణన్‌ పర్యటించారు. ప్రత్యేక రైలులో స్టేషన్‌కు చేరుకున్నారు. అధికారులతో కలిసి స్టేషన్‌ ఆవరణలోని ఖాళీ స్థలం, గూడ్స్‌ షెడ్‌, ట్రాక్‌లు, సైడింగ్‌ సౌకర్యాలను పరిశీలించారు. కంటైనర్‌ టెర్మినల్‌ ఏర్పాటుకు కావాల్సిన రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్‌, నీటి సౌకర్యాలపై ఆరా తీశారు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలతోపాటు అదనంగా ఏం అవసరమో అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రైల్వే డీవోఎం ఆపరేటింగ్‌, నార్త్‌ ఇంజినీరింగ్‌, సిగ్నల్‌, ఎలక్ట్రికల్‌ డిపార్టుమెంట్‌ అధికారులు, ఆర్పీఎఫ్‌ ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై దాసు ఉన్నారు.

డీఆర్‌ఎంకు వినతి

డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌ను ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు ఠాకూర్‌ ప్రవీణ్‌సింగ్‌ కలిసి వినతిపత్రం అందించారు. బెంగాలీల సౌకర్యార్థం బల్లార్షా మీదుగా హైదరాబాద్‌ నుంచి నూతన రైలు సౌకర్యం, కాజిపేట నుంచి బల్లార్షా మీదుగా ముంబయికి రైలు, 17036 బల్లార్షా నుంచి కాజిపేట ఎక్స్‌ప్రెస్‌ రైలును చర్లపల్లి వరకు పొడిగించి.. ప్రస్తుతం నడుస్తున్న సమయాల్లో మార్పు చేయాలని కోరారు. అలాగే కాగజ్‌నగర్‌ మీదుగా ఐదేళ్లుగా నడుస్తున్న ప్రత్యేక రైళ్లు క్రమబద్ధీకరించాలని, ఆదిలాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఫిట్‌ లైన్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆదిలాబాద్‌ నుంచి తిరుపతి వయా బల్లార్షా, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మీదుగా వీక్లి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపించాలని విన్నవించారు.

Advertisement
 
Advertisement
Advertisement