వేసవి తాపం..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో తాగునీటి ఇక్కట్లు
అసలే ఎండాకాలం.. రోజురోజుకూ భానుడు తీవ్ర రూపం దాల్చుతున్నాడు. ప్రజలు వేడి, ఉక్కపోతతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన వారికి తాగేందుకు కనీసం గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి. కొన్నిచోట్ల వైద్యసిబ్బంది తాత్కాలిక ఏర్పాట్లతో సరిపెట్టారు. మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక కేంద్రాలు, సామాజిక ఆస్పత్రులను ‘సాక్షి’ సందర్శించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూల్‌వాటర్ ఫ్రిజ్‌లు చెడిపోయినా మరమ్మతులు చేయించడం లేదు. వైద్యసిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా
మిగులుతోంది.


