కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ సామాజిక ప్ర భుత్వ ఆస్పత్రి సేవల్లో ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడికి ప్రతిరోజూ సుమారు 300 మంది రోగులు వస్తుంటారు. సగటున 20 మంది ఇన్‌పేషెంట్లుగా చేరి చికిత్స పొందుతున్నారు. ఓపీ పేషెంట్లను చూడటానికి ఇద్దరు మహిళా వైద్యులు, ఒకరు గైనకాలజిస్ట్, జనరల్ వైద్యురాలు, చిల్ట్రన్స్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్ వైద్యులు నిత్యం సేవలందిస్తున్నారు. రక్త పరీక్షలు, ఎక్స్‌రే, ఈసీజీ, స్కానింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వేసవి నేపథ్యంలో మందుల కొరత లేకుండా స్టాక్ ఉంచుతున్నారు. ఫ్యాన్లు, చల్లని మినరల్ తాగునీటి సౌకర్యం కల్పించారు.
రోగుల్లో ధైర్యం నింపాలి
వైద్యం అంటే కేవలం మందులు రాసివ్వడం కాదు. రోగుల మనసులో ధైర్యం నింపాలి. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందిండమే లక్ష్యం. ప్రతిరోజూ ఓపీకి సుమారు 300 మంది వరకు వస్తున్నారు. – అవినాష్,
సూపరింటెండెంట్, కాగజ్‌నగర్ సీహెచ్‌సీ


