ఇన్‌చార్జికి బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జికి బాధ్యతలు

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

చింతలమానెపల్లి: బాబాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్‌ వైద్యాధికారి లేక కమ్యూనిటీ హెల్త్‌ అధికారి రాజ్‌కుమార్‌ ఇన్‌చా ర్జి బాధ్యతలు అప్పగించారు. జనరల్‌ వార్డులో ఫ్యాన్లు పనిచేస్తున్నా యి. చల్లని మినరల్‌ నీటిని అందుబాటులో ఉంచుతున్నామని వైద్యాధికారి రాజ్‌కుమార్‌ తెలిపారు. వేసవి నేపథ్యంలో వడదెబ్బ, వాంతులు, విరోచనాలకు అవసరమైన మందులు పూర్తిస్థాయిలో ఉన్నాయని ఫార్మసిస్టు వీఎస్‌ఎన్‌ రెడ్డి తెలిపారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. రక్త పరీక్షల కోసం ల్యాబ్‌ టెక్నీషియన్‌ స్వప్న, మల్టీపర్పస్‌ హెల్త్‌ సూపర్‌వైజర్‌ సుమతి, స్టాఫ్‌ నర్స్‌ దుర్గ విధుల్లో ఉన్నారు. ఓపీ ఏఎన్‌ఎం తార్సీనా రోగులకు అవసరమైన సలహాలు అందిస్తున్నారు. మండలంలో 24గంటలు పనిచేసే పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని మండల వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement