రెబ్బెన: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు సింగరేణి సంస్థ తగిన ప్రోత్సాహం అందిస్తుందని జీఎం విజయ భాస్కర్‌రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయంలో మంగళవారం పుస్తకాలు పంపిణీ చేశారు. జీఎం మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి ఉద్యోగుల పిల్లలను ఉన్నతస్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతో సేవా సమితి ఆధ్వర్యంలో గ్రంథాలయాలను ఏర్పాటు చేశామన్నారు. 2014 నుంచి వందలాది మంది చదుకున్నారని అన్నారు. గోలేటిలోని గ్రంథాలయంలో 35 మంది ప్రభుత్వ కొలువులు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, సీఎంవోఏఐ ఏరియా అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, పర్సనల్ హెచ్‌వోడీ ఎస్వీ రాజేశ్వర్‌రావు, ఖైరిగూర మేనేజర్ శంకర్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, లైబ్రరీ కేర్ టేకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


