దహెగాంలో చల్లటి నీళ్లు లేవు | - | Sakshi
Sakshi News home page

దహెగాంలో చల్లటి నీళ్లు లేవు

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

దహెగాం: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ‘సాక్షి’విజిట్‌ చేసింది. వైద్యధికారి ఉదయం పది గంటలు దాటినా విధులకు హాజరు కాలేదు. వేసవి దృష్ట్యా అవసరమయ్యే మందులు అందుబాటులో ఉన్నాయి. పీహెచ్‌సీ నూతన భవనం కావడంతో ఫ్యాన్లు సక్రమంగానే ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చే రోగులకు చల్లటి నీరు అందుబాటులో లేక సాధారణ తాగునీటిని తాగుతున్నారు. రెగ్యులర్‌ వైద్యాధికారి లేకపోవడంతో రెబ్బెన పీహెచ్‌సీ వైద్యుడు ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. సిబ్బంది కొరత వేధిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement