ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

కాగజ్‌నగర్‌టౌన్‌: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. పట్టణంలోని సామాజిక ప్రభుత్వ ఆస్పత్రికి భారత్‌ డైనమిక్‌ లిమిటెడ్‌ వారి సహకారంతో 15 ఐసీయూ బెడ్లు, 10 స్ట్రెచర్‌ బెడ్లు అందజేశారు. అలాగే మంగళవారం ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానాతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని, సగటున నెలకు 50కి తగ్గకుండా నార్మల్‌ డెలివరీలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘కాయకల్ప’ పథకానికి ఆస్పత్రి ఎంపికయ్యే అవకాశం ఉందని, అందుకు వైద్యులు, సిబ్బంది మరింత కృషి చేయాలని సూచించారు. వంద పడకల నూతన ఏరియా ఆస్పత్రి పూర్తయితే నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుతుందని తెలిపారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి విన్నవించడం, అసెంబ్లీలో ప్రస్తావించడంతో అదనంగా కాగజ్‌నగర్‌లో 5, సిర్పూర్‌(టి)లో 5, కౌటాల పీహెచ్‌సీ 5, బెజ్జూర్‌లో 5 పడకలు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అవినాష్‌, వైద్యులు శ్రీధర్‌బాబు, అరుణ్‌, హర్షవర్ధన్‌, గైనకాలజిస్ట్‌ అరుణ, రథన్‌రాజ్‌, నాయకులు నందిసాయి, గజ్జెల లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement