కాగజ్‌నగర్‌టౌన్: పట్టణ ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తామని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఉత్తమ్ జాడే అన్నారు. పట్టణంలోని ఆదర్శనగర్ సబ్‌స్టేషన్‌ను సోమవారం సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పట్టణంలో ఈ నెల 17, 18 రోజుల్లో సాంకేతిక కారణాలతో రెండుసార్లు కరెంటు పోయిందని, వెంటనే స్పందించిన అధికారులు సమస్య పరిష్కరించారని గుర్తు చేశారు. ఓవర్‌లోడ్‌ను అధిగమించేందుకు 160 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు 6, 100 కేవీఏల 18 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. డీఈ నాగరాజు, ఏడీఈ ఇర్ఫాన్ అహ్మద్ పాల్గొన్నారు.


