కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ బీట్ మార్కెట్‌లో సోమవా రం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్కలు పండించిన రైతులు విన్నపం మేరకు కౌటాల, కాగజ్‌నగర్‌లో రెండు మక్కల కొనుగోలు కేంద్రాలను మంజూరు చేశామని తెలిపారు. రైతులు ప్రభుత్వ మద్దతు ధర రూ.2400కు విక్రయించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో డీఏవో వెంకట్, డీసీవో మోహన్, ఏవోలు రామకృష్ణ, నాగరాజు, గిరిషన్, కార్తీక్, ప్రేమలత, పీఏసీఎస్ కార్యదర్శి సతీశ్‌గౌడ్, ఏఈవోలు రేష్మిత, సృజన, జ్ఞానేశ్వర్, విశాల్, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.


