ఆసిఫాబాద్: మహర్షి బసవేశ్వరుడి చరిత్ర భావితరా లకు ఆదర్శమని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం బసవేశ్వర జయంతి ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, ఏఎంసీ చైర్‌పర్సన్ ఇరుకుల్ల మంగతో కలిసి బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మహర్షి బసవేశ్వరుడు 12వ శతా బ్దపు గొప్ప భారతీయ తత్వవేత్త, సంఘ సంస్కర్త, లింగాయత్ స్థాపకుడు అని కొనియాడారు. సమాజంలో కుల, లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి న అభ్యుదయ వాది అన్నారు. సమానత్వం, ప్రేమ, భక్తి బోధిస్తూ కుల వ్యవస్థపై తీవ్రంగా పోరాటం చేశారని తెలిపారు.
తాగునీటి ఇబ్బందులు రానీయొద్దు
వేసవిలో మారుమూల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు రానీయొద్దని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ కార్యాలయాలను సోమవారం తనిఖీ చేసి హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే ఇంజినీరింగ్ అధికారులు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించా రు. మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు.
ప్రతీ అంశంపై అవగాహన పెంచుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఇళ్ల గణనలో ప్రతీ అంశంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఇళ్ల గణన కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత ఇళ్ల గణనలో ఇంటి యజమాని నుంచి సరైన వివరాలు సేకరించాలన్నారు. వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు చేయొద్దని ఆదేశించారు.


