మందమర్రిరూరల్: మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన కాపురపు రవికుమార్‌కు కవితా పోటీల్లో ప్రథమ బహుమతి దక్కింది. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో కవులు, కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కవితా పోటీలు నిర్వహించారు. రవికుమార్ రాసిన ‘నువ్వు–నేను వేరెట్‌లైతంరా’అనే కవిత ప్రథమ స్థానంలో నిలిచింది. ఆదివారం జనగామలో నిర్వహించిన అకాడమీ వార్షికోత్సవ వేడుకలో నిర్వాహకులు శాలువా కప్పి అవార్డును అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, కేంద్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిదారెడ్డి, కాళోజీ అవార్డు గ్రహీత నెల్లుట్ల రమాదేవి, యక్షగాన కళాకారులు గడ్డం సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.


