ఉట్నూర్‌రూరల్: ఇంద్రవెల్లి అమరువీరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు సోమవారం నిర్వహించే సభకు గిరిజనులు భారీగా తరలిరావాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పెందూర్ దాదిరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ కోరారు. మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఆదివారం వారు విలేకరులతో మా ట్లాడారు. ఇంద్రవెల్లి ఘటనకు 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మృతివనం వద్ద సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అమరుల ఆశయాలను కొనసాగించడం ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు. కార్యక్రమంలో కుమురం భీం మనుమడు కుమురం సోనేరావు, జిల్లా సార్‌మేడి తొడసం అమృత్‌రావు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందూర్ సంతోష్, నాయకులు మెస్రం నాగనాథ్, త్రిమూర్తి, మోతీరాం, మారుతి, రామ్‌దాస్, భరత్, ఆదివాసీ పెద్దలు పాల్గొన్నారు.


