14 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల కిశోర బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వసతి గృహాల్లో చదువుకునే బాలికలు ఇంటికి వచ్చాక వారి తల్లిదండ్రులు పిల్లలను ఆస్పత్రులకు తీసుకెళ్లి టీకాలు వేయించాలి. భవిష్యత్తులో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ముప్పు ఉండదు. జిల్లాలో 3,980 మంది కిశోర బాలికలు ఉన్నట్లు గుర్తించాం. వేసవి సెలవుల్లో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం.
– సీతారాం, డీఎంహెచ్‌వో


