ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం
45 ఏళ్లు
ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధికారంలోకి రాగానే స్మృతి వనం ఏర్పాటుకు సంకల్పించారు. రూ.కోటి మంజూరు చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన మాట నిలుపుకున్నారు. బాధిత కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా రాయితీ రుణాలతో వాహనాలు అందించడంతో పాటు మండలంలోని ముత్నూర్ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశారు. పనులు కొనసాగుతున్నాయి.
అసలేం జరిగింది..
స్వాతంత్య్రం వచ్చి అప్పటికి మూడున్నర దశాబ్దాలవుతున్నా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 1981లో చట్టబద్దమైన హక్కుల సాధన కోసం పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవారం వారసంత కావడంతో ఉదయం నుంచే ఆదివాసీలు భారీగా తరలివచ్చా రు. మధ్యాహ్నం 3 గంటల వరకే ప్రాంగణం గిరి పుత్రులతో కిక్కిరిసిపోయింది. సభా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా మరికొందరు ర్యాలీగా అక్కడికి బయలుదేరారు. వారిని అడ్డుకునే క్రమంలో ముందున్న గిరిజన యువతితో ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే అతడిపై దాడి చేయగా నెలకొరిగాడు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు తూటాల వర్షం కురిపించారు. రక్తం ఏరులై పారింది. ఈ ఘటనలో 15 మంది ఆదివాసీలు చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. కానీ అప్పుడు తూటాల గాయాలతో తమ ఇళ్లకు వెళ్లి పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక సుమారు 60 మంది వరకు మృతి చెందినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది.
రెండోసారి స్మారక స్తూపం నిర్మాణం
ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్తూపాన్ని నిర్మించింది. దానిని 1986 మార్చిలో గుర్తుతెలియని వ్యక్తులు డైనమేట్ల తో పేల్చారు. గిరిజనుల ఆందోళనలతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో స్తూపం నిర్మించింది.
అమరవీరుల ఆశయ సాధన కోసం రిలే దీక్షలు
నాటి ఆదివాసీ అమరుల ఆశయ సాధన కోసం ఇటీవల కొద్ది రోజుల పాటు ఆదివాసీలు స్తూపం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో పెసా, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని, ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి అదుకోవాలని, ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
1981 ఏప్రిల్ 20. జల్..జంగల్.. జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు
అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన పచ్చని వనం ఎరుపెక్కింది. వారి అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 45 ఏళ్లు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల స్తూపాన్ని స్మృతివనంగా ఏర్పాటు చేసింది. అలాగే ఆంక్షలు లేకుండా అధికారికంగా నివాళులర్పించే అవకాశం కల్పించింది. ఈ సారి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
– ఇంద్రవెల్లి
హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్స్‌లో ఈ నెల 24న సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సమితి అధ్యక్షుడు బోనగిరి సతీశ్‌బాబు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆదివారం పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్య అతిఽథిగా భవానీ స్వామిజీ(కామాఖ్య దేవస్థానం ప్రధాన అర్చకులు), ప్రధాన వక్తగా సౌమిత్రి లక్ష్మణాచార్యులు హాజరు కానున్నట్లు తెలిపారు. మాజీ ఏఎంసీ శ్రీనివాస్ మాట్లాడుతూ గడపలోపలే కులం గడప దాటితే హిందువులమని అన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు ఖాండ్రె విశాల్, ప్రధాన కార్యదర్శి ఆకుల సంతోష్, ఆర్‌ఎస్‌ఎస్ సంపర్గ ప్రముఖ్ నాగుల శ్రీనివాస్, సరస్వతి శిశుమందిర్ ప్రధాన ఉపాధ్యాయులు గుండేటి కోటేశ్వర్‌రావు, సభ్యులు పాల్గొన్నారు.
33 ఏళ్లు.. నివాళులకు దూరం
నాటి కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో స్తూపం నిర్మించారు. ఆ రోజు నుంచి ఉమ్మడి రాష్ట్రపాలన ముగిసే వరకు 33 ఏళ్లుగా నివాళులర్పించడానికి అనుమతి ఇవ్వలేదు. ఏటా బందోబస్తు ఏర్పాటు చేసేవారు. 2004లో అప్పటి బోథ్ ఎమ్మెల్యే సోయం బాపూరావ్ గిరిజన సంఘాల నాయకులతో పాటు ఎంపీ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఏప్రిల్ 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీలు ఆ రోజున ఆంక్షల నడుమ నివాళులర్పించడం ఆనవాయితీగా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ సంఘాల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆంక్షలు సడలించింది. రెండు గంటల సమయం ఇవ్వడంతో ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేసి నివాళులర్పిస్తూ వచ్చారు.


