అడవుల రక్షణకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

అడవుల రక్షణకు సహకరించాలి

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

పెంచికల్‌పేట్‌: అడవుల రక్షణకు గ్రామీణ ప్రాంత ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమా ర్‌ టిబ్రేవాల్‌ అన్నారు. పెంచికల్‌పేట్‌ మండలంలో ని అగర్‌గూడ, గుండెపల్లి గ్రామాల్లో ఆదివారం 30 మందికి ఇండక్షన్‌ స్టౌవ్‌లు అందించి, ఆయా గ్రామాల్లో సోలార్‌ స్ట్రీట్‌ లైట్లు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పోడు వ్యవసాయంతో పేరుతో అడవులను నాశనం చేయొద్దని సూచించారు. గ్రామాల్లోని సమస్యలను అటవీ అధికారులతో చర్చించి పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. డీఎఫ్‌వో మాట్లాడు తూ అనుమతులు లేకుండా అడవుల్లో ప్రవేశించవద్దన్నారు. రానున్న రోజుల్లో గిరిజన గ్రామాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్‌ఎస్‌ భార్గవ్‌, ఎఫ్‌డీవో అప్పయ్య, ఎఫ్‌ఆర్‌వో అనిల్‌కుమార్‌, సర్పంచులు రాజేశ్వరి, సులోచన, గ్రామస్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement