కౌటాల: కౌటాల మాజీ ఎంపీపీ బసర్కార్ విశ్వనాథ్ శనివారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని మంత్రి సూచించారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రానున్న ‘పరిషత్’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని సూచించారు. పార్టీ నాయకులు అర్షద్ హుస్సేన్, సదన్‌రెడ్డి తదితరులున్నారు.


