జనగణనకు రెడీ | - | Sakshi
Sakshi News home page

జనగణనకు రెడీ

Apr 19 2026 8:05 AM | Updated on Apr 19 2026 8:05 AM

మే 11నుంచి జిల్లాలో సర్వే షురూ

ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల మూడు

మొదట ఇళ్ల గణన, తర్వాత జనగణన

పకడ్బందీ నిర్వహణకు కార్యాచరణ

కెరమెరి: దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన ప్రక్రియకు సంబంధించి జిల్లాలో అధికారులు కసరత్తు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జనగణనను సమగ్రంగా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ తరగతులను శనివారం ప్రా రంభించింది. మూడు దశల్లో శిక్షణ తరగతులు ని ర్వహించనుంది. జనగణనలో ఎలాంటి లోపాలు త లెత్తకుండా అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నా రు. మొదటి దశ శిక్షణ తరగతులు ఈ నెల 18, 20, 21తేదీల్లో, రెండోవిడత 24, 25, 26తేదీల్లో, మూ డోవిడత మే 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు.

మొదటి దశలో ఇళ్ల గణన

జనగణన–2026లో భాగంగా మొదటి దశలో ఇళ్ల గణన చేపట్టనున్నారు. ఇందులో మొదటిసారిగా స్వీయ గణన ప్రవేశపెట్టారు. కుటుంబంలో ఏ వ్యక్తి అయినా ఎక్కడి నుంచైనా పోర్టల్‌లో వివరాలు నమోదు చేయవచ్చు. ఆధునిక సమగ్ర డేటా సేకరణకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అధికారులు ఐడీని జనరేట్‌ చేసి ఎన్‌ఎంఎఫ్‌, ఈ మెయిల్‌ ద్వారా అందిస్తే ఎన్యుమరేటర్‌ పరిశీలిస్తారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లను నియమించి శిక్షణ ప్రారంభించగా జిల్లా స్థాయిలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ను నియమించారు. మున్సిపల్‌ స్థాయిలో కమిషనర్‌ను, మండల స్థాయిలో సెన్సెస్‌ చార్జ్‌ (తహసీ ల్దార్‌, ఎంపీడీవో) లను నియామకం చేశారు. 750 నుంచి 800 మంది జనాభాకు ఆరుగురు ఎన్యుమరేటర్లు, ఒక సూపర్‌వైజర్‌ను కేటాయించారు. ఒక ఎన్యుమరేటర్‌ను ఒక బ్లాక్‌గా విభజించారు.

పథకాల అమలు కోసమే..

జనగణన సర్వేకు వెళ్లే ఎన్యుమరేటర్లు కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించనున్నారు. ఈ సమాచారాన్ని డిజిటల్‌ రూపంలో నమోదు చేసి భద్రపరచనున్నారు. గిరిజన ప్రాంతాలు, దూర ప్రాంతాల్లోనూ జనగణన సజావుగా సాగేందుకు అ వసరమైతే అదనపు సిబ్బందిని కూడా నియమించనున్నారు. ప్రతీ దశలో పర్యవేక్షణ వ్యవస్థను బలో పేతం చేసి డేటా కచ్చితత్వంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. దీంతో జనగణన ద్వారా ప్రభుత్వం వ ద్ద సరైన డేటా, గణాంకాలు లభించే అవకాశముంది. ఈ డేటా ద్వారా సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా భవిష్యత్‌ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు కూడా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే మే 11నుంచి అధికారికంగా జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోనూ సమగ్ర సర్వే నిర్వహించనున్నారు.

ఒక్క ఇల్లు వదలకుండా..

ఎన్యుమరేటర్‌ పరిధిలో ఉన్న ఒక్క ఇంటిని కూడా వదలకుండా సర్వే చేపట్టనున్నారు. ఇప్పటికే అధికా రులు వార్డుల వారీగా మ్యాప్‌లను సిద్ధం చేశారు. వాటి ఆధారంగానే ఎన్యుమరేటర్‌ బ్లాక్‌లను విభజించారు. హెచ్‌ఎల్‌వో యాప్‌ ద్వారా ఓ మ్యాప్‌ను ఎన్యుమరేటర్‌ భవనాలు, రోడ్లు, వీధులను చూపిస్తూ పటాన్ని గీస్తారు. అన్ని ఇళ్ల వివరాలు నమోదు చేస్తారు. జనగణన చట్టం 1948 ప్రకారం సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, ఆర్‌టీఐ చట్టం–2005 ప్రకారం బహిర్గతం చేయరాదని అధికారులు చెబుతున్నారు.

ఇల్లు లేని వారిని రెండోదశలో..

బహిరంగ ప్రదేశాలు, రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో, ఫుట్‌పాత్‌లపై, ఫ్లైఓవర్ల కింద, ప్రార్థనాస్థలాలు, మండపాలు, రైల్వే ప్లాట్‌ఫాంలు తదితర ప్రదేశాల్లో నివసించే వారిని రెండో దశలో లెక్కించనున్నారు. ఇళ్ల జాబితా ప్రకారం బ్లాక్‌లోని ప్రతీ ఇంటికి ఎన్యుమరేటర్ల నంబర్లు కేటాయిస్తారు. డిజిటల్‌ పద్ధతిన ఈ నంబర్లు వేస్తారు. వరుసక్రమంలో కేటాయింపు ఉంటుంది. కాగా, పంప్‌హౌస్‌లు, దేవాలయాలు, జ్ఞాన మందిరాలు, పొలాల్లో కట్టిన గుడిసెలకూ నంబర్లు కేటాయిస్తారు. 34రకాల వివరాలు మొబైల్‌ యాప్‌లో నమోదు చేస్తారు. ఇంటి స్థితి, తాగునీరు, దంపతుల వివరాలు, మరుగుదొడ్డి, మురుగునీటి పారుదల, ఎల్పీజీ కనెక్షన్‌, వంట గది, రేడియో, టెలివిజన్‌ ఇంటర్నెట్‌ సదుపాయం, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌, మొబైల్‌, నాలుగు చక్రాల వాహనాలు తదితర వివరాలు నమోదు చేయనున్నారు.

రోజుల శిక్షణ తరగతులు ప్రారంభం

అధికారులు వివరాలు

ఎన్యుమరేటర్లు 1,168

సూపర్‌వైజర్లు 174

ఫీల్డ్‌ అధికారులు 20

సెన్సెస్‌ క్లర్కులు 17

సెన్సెస్‌ చార్జ్‌ ఆఫీసర్లు 17

టెక్నికల్‌ అసిస్టెంట్లు 20

ఎంపీడీవోలు 15

Advertisement
 
Advertisement
Advertisement