కెరమెరి: క్రీడలు మానసికోల్లాసానికి ఎంతో దోహ దపడతాయని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పే ర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో పెందోర్ శ్యాంరావు పటేల్ సేవా సమితి ఆధ్వర్యంలో శ్యాంరావు పటేల్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్యాంరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆట లు క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాలు పెంచుతాయని, శారీరక దారుఢ్యానికి దోహదపడుతాయ ని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్ కుమార్, ఎంపీడీవో సాయిరాంగౌడ్, ఎస్సై మధుకర్, సర్పంచ్ ఆనంద్‌రావు, ఉపసర్పంచ్ శ్రీకాంత్, మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, వైస్ ఎంపీపీ అబ్దుల్ కలాం, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు దుర్పతాబాయి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మునీర్ అహ్మద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాజిత్, నాయకులు తుకారాం, కుసుంబ్‌రావు తదితరులున్నారు.
తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి సూచించారు. మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన అరైవ్–అలైవ్ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకరికి ప్రాణాపాయం జరిగితే కుటుంబమంతా ఇబ్బంది పాలవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి వాహనం నడిపిన వారిని చప్పట్లతో ప్రశంసించి పూలతో సత్కరించారు. హెల్మెట్ లేకుండా వెళ్లేవారికి అవగాహన కల్పించారు. ఎస్సై మధుకర్, సిబ్బంది ఉన్నారు.


