ఆసిఫాబాద్: జిల్లాలో ఇళ్ల గణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ హరిత సూచించారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆసిఫాబాద్ మండలానికి చెందిన ఎన్యుమరేట ర్లు, సూపర్‌వైజర్లకు మూడురోజుల పాటు నిర్వ హించే శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి వాసుదేవారెడ్డితో కలిసి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జనాభా గణన–2027లో భాగంగా మొదటి విడత వచ్చే నెల 11నుంచి జిల్లాలో ఇళ్లగణన ప్రారంభమవుతుందని తెలిపారు. ఇంటి యజమాని నుంచి 32 ప్రశ్నలకు సమాధానాలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తిగా డిజిటల్ పద్ధతిలో సర్వే ఉంటుందని తెలిపారు. ఇళ్ల గణనకు 994 మంది ఎన్యుమరేటర్లు, 174 మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వీరితో పాటు చార్ట్ అధికా రులు, అడిషనల్ చార్ట్ అధికారులు, కంప్యూటర్ ఆ పరేటర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలో 1,689 హౌస్ లిస్టింగ్ బ్లాక్‌గా గుర్తించినట్లు పే ర్కొన్నారు. తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో శ్రీని వాస్, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు భవిత కేంద్రాల భరోసా
ఆసిఫాబాద్‌రూరల్: దివ్యాంగ విద్యార్థులకు భవిత కేంద్రాలు భరోసానిస్తాయని కలెక్టర్ హరిత పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లోగల భవిత కేంద్రాన్ని డీఈవో లలితతో కలిసి సందర్శించారు. విద్యార్థులకు టీచింగ్, లర్నింగ్ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందిస్తోందని తెలిపారు. వారు ఇతర విద్యార్థుల్లాగే చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారని తెలిపారు. విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా పొత్సాహించాలని సూచించారు. కలెక్టర్ వెంట మండల విద్యాధికారి సుభాష్, ఎస్వో శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.


