ఆసిఫాబాద్: తెలంగాణ తల్లి మనోభావాలు దెబ్బ తీసేలా, అమరుల త్యాగాలను అవమానించేలా లో క్ సభలో వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూ ర్య క్షమాపణ చెప్పాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏఎంసీ చైర్‌పర్సన్ ఇ రుకుల్ల మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, పా ర్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన తప్పుడు వ్యాఖ్యలు పునరావృతమైతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సూర్య వ్యా ఖ్యలపై కేంద్ర మంత్రులు, తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనం వహించడం దురదృష్టకరమని విమర్శించారు. తేజస్వి సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు మహిళలకు సరైన ప్రాతినిథ్యం కల్పించిందని, దీనిపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. డీలిమి టేషన్‌తో సంబంధం లేకుండా మహిళా బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేడ్కర్ చౌక్ వద్ద ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎంపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గ డ్డల సత్తయ్య, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, పార్టీ నాయకులు తారిక్, తిరుపతి, సుధాకర్, జావిద్, మారుతి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


