● జీఎం విజయ భాస్కర్‌రెడ్డి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరి యా గడిచిన ఆర్థిక సంవత్సరంలో అందరి సహకారంతో 101 శా తం వార్షిక ఉత్పత్తిని సాధించిందని జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు వెల్లడించారు. మార్చిలో ఏరియా 3.50 లక్షల టన్నులకు 4.30 లక్షల టన్నులు సాధించి 123 శాతం ఉత్పత్తిని నమోదు చేసిందని తెలిపారు. ఇక వార్షిక ఉత్పత్తిలో ఏరియాకు 35లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా, 35.36లక్షల టన్నులతో 101 శాతం ఉత్పత్తి చేపట్టగలిగామన్నారు. సింగరేణి వ్యాప్తంగా కేవలం రెండు ఏరియాలు మాత్రమే వందశాతం వార్షిక ఉత్పత్తిని సాధించగా, అందులో బెల్లంపల్లి ఏరియా ఉండటం సంతోషకరమన్నారు. గత సంవత్సరం 36.05 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయగా.. ఈసారి 4.34 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామని తెలిపారు. సమావేశంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, పర్సనల్ హెచ్‌వోడీ రాజేశ్వర్‌రావు, సీనియర్ పీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.


